జగిత్యాల మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన కేసీఆర్
CM KCR | జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం కేసీఆర్ భవన నిర్మాణ పనులకు
CM KCR | జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం కేసీఆర్ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాలలో మెడికల్ కాలేజీని ప్రకటించారు. గతేడాది 1001 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులకు అనుమతి అనుమతి ఇచ్చారు.
ధరూర్ క్యాంపులో 27 ఎకరాల్లో మెడికల్ కాలేజీకి స్థలం కేటాయించారు. కళాశాలకు అనుబంధంగా 330 బెడ్స్ దవాఖానకు మంజూరు చేసి తాత్కాలిక భవనంలో ప్రారంభించారు. ఈ యేడాది మే 7న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దవాఖానను ప్రారంభించగా.. నవంబర్ 15న సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రగతి భవన్ నుంచి మెడికల్ కాలేజీ తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. మెడికల్ కాలేజీకి సొంత భవన నిర్మించేందుకు 27.08 ఎకరాల వైశాల్యంలో కాలేజీకి భవనం నిర్మించడంతో పాటు దానికి అనుగుణంగా ప్రభుత్వ దవాఖానను నిర్మించనున్నారు. ఇందు కోసం రూ.119కోట్లు కేటాయించింది. రెండెకరాల్లో మెడికల్ కాలేజీ, అరెకరంలో విద్యార్థుల క్యాంపస్, మరో అరెకరంలో బాలుర క్యాంపస్, దాదాపు నాలుగు ఎకరాల్లో అనుబంధ సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం చేపట్టనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

