PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేశారు. ఇజ్రాయెల్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని మోదీని నెతన్యాహు కోరారు.
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేశారు. ఇజ్రాయెల్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని మోదీని నెతన్యాహు కోరారు. ఈ విషయాన్ని నెతన్యాహు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌తో కలిసి వేడుకల్లో పాల్గొనాలని, టార్చ్ వెలిగించాలని నెతన్యాహు కోరారు.
ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు. తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. ఇదే అంశంపై నెతన్యాహు కూడా స్పందించారు. నా స్నేహితుడు, ప్రధాని మోదీతో మాట్లాడాను. భారతీయ పైలట్, హీరో.. స్మిత్ మచ్చర్‌తో కలిసి ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనాలని కోరాను. ఈ వేడుకలకు ఆహ్వానం పలికినందుకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇండియా, ఇజ్రాయెల్ రెండు దేశాలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
मैंने अपने मित्र, भारत के प्रधानमंत्री नरेंद्र मोदी से बात की और उन्हें इज़राइल के स्वतंत्रता दिवस पर वीर भारतीय पायलट के साथ मशाल प्रज्वलित करने के लिए आमंत्रित किया।
मोदी ने निमंत्रण के लिए मुझे धन्यवाद दिया और कहा कि ज़मीन पर और हवा में, भारत और इज़राइल आतंकवाद के ख़िलाफ़ मिलकर लड़ रहे हैं। उन्होंने हमारे बीच के मज़बूत और वर्षों पुराने संबंधों की भी सराहना की। 🇮🇱🇮🇳
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) October 22, 2026
దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం గురించి మోదీ ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై హర్షం వ్యక్తం చేశారు అంటూ నెతన్యాహు పేర్కొన్నారు. ఈ మేరకు మోదీతో ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. ఇదే సమయంలో ఇటీవల విమానం ప్రమాదం నుంచి ఇజ్రాయెల్ పౌరులను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌ను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. ఆయనతో కలిసి ప్రధాని మోదీ అక్కడ టార్చ్ వెలిగిస్తారు. మోదీ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఇజ్రాయెల్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

