Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
Passengers sit on tracks | ఒక బృందానికి చెందిన యువకుడు ఏసీ కోచ్‌లోకి ఎక్కాడు. ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిపై దాడి చేశారు. ఆ బృందంలోని మహిళలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా వారిపై దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికులు పట్టాలపై కూర్చొని రైలు కదలకుండా నిరసన తెలిపారు.
ముంబై: ఒక బృందానికి చెందిన యువకుడు ఏసీ కోచ్‌లోకి ఎక్కాడు. ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిపై దాడి చేశారు. ఆ బృందంలోని మహిళలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా వారిపై దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికులు పట్టాలపై కూర్చొని రైలు కదలకుండా నిరసన తెలిపారు. (Passengers sit on tracks) మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ఒక బృందానికి చెందిన వ్యక్తులు నాగపూర్‌లో జరిగిన దసరా కార్యక్రమంలో పాల్గొన్నారు. నాందేడ్‌కు తిరిగి వెళ్లేందుకు గురువారం తెల్లవారుజామున భగత్ కి కోఠి-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలును అకోలాలో ఎక్కారు.
కాగా, ఆ బృందానికి చెందిన ఒక యువకుడు పొరపాటున రిజర్వ్డ్ కోచ్‌లోకి ప్రవేశించాడు. దీంతో ఆ కోచ్‌లోని కొందరు ప్రయాణికులు, ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని కొట్టారు. ఆ బృందానికి చెందిన మహిళలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా వారిని తోసివేసి దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికులు ఆగ్రహించారు. ఆ రైలు హింగోలి స్టేషన్‌కు చేరుకోగానే వారంతా కిందకు దిగారు. రైలు ఇంజిన్ ముందు పట్టాలపై కూర్చొన్నారు. ఆ రైలు ముందుకు కదలకుండా నిరసన తెలిపారు. రైల్వే సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ రైలు రెండు గంటలకుపైగా ఆ స్టేషన్లో నిలిచిపోయింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న హింగోలి పోలీసులు ఆ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఆ ప్రయాణికుల ఆరోపణలు, వారి ఫిర్యాదుపై విచారణ జరుపుతామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో నిరసనకారులు తమ ఆందోళనను విరమించారు. ఈ నేపథ్యంలో రెండు గంటలకుపైగా స్టేషన్లో నిలిచిన ఆ రైలు చివరకు అక్కడి నుంచి కదిలినట్లు రైల్వే అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

