TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
TGICCC | హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
TGICCC | హైదరాబాద్, అక్టోబరు 22 : దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలీసు సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో నిర్వహిస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన డిజిపిలు, ఐజీలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ సంస్థల అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, పరస్పర సహకారం, సమన్వయంతో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
ప్రధాన అంశాలపై చర్చ ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాల అనంతర పరిస్థితులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, ఆర్థిక నేరాలు, యువత నిరసనలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలు సమావేశం ఎజెండాలో ఉన్నాయి. అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠాల కదలికలు, నేరగాళ్ల సమాచార మార్పిడి, నేరాల దర్యాప్తులో ఎదురవుతున్న సమస్యలు, ఆయా రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచే మార్గాలపై సమీక్షించనున్నారు.
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరు, సముద్ర తీర ప్రాంతాల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, పోలీసింగ్‌లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వంటి అంశాలపైనా విస్తృతంగా చర్చించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలు పరస్పర సహకారంతో పనిచేస్తే సరిహద్దులు దాటి విస్తరిస్తున్న నేరాలను సమర్థంగా అరికట్టవచ్చన్న లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
Read Also :
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

