RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | మేడిగడ్డ బ్యారేజ్ కూల్చేశారని అధికారులకు ఫిర్యాదు చేసి మూడు సంవత్సరాలు గడిచింది. ఇంతవరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
RS Praveen Kumar | మేడిగడ్డ బ్యారేజ్ కూల్చేశారని అధికారులకు ఫిర్యాదు చేసి మూడు సంవత్సరాలు గడిచింది. ఇంతవరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేల్కొలిపి, ఆ కేసు గురించి గుర్తుచేయాలనే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశామన్నారు.యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సీఈ సురేష్ నిజం చెప్పాడని అతన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారుల కమిటీ వేశారు. సోషియాలజీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్న వాళ్లకు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, బొగ్గు వినియోగం ఎలా అర్థమవుతాయి? అని ప్రశ్నించారు. ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులను పంపించారు. విద్యుత్ సంస్థలను బాగు చేసిన ఇంజినీర్లపై కక్ష ఎందుకు? అని నిలదీశారు.
కాగా, మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండని కాంగ్రెస్ మంత్రుల సమక్షంలో అప్పటి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం రాజకీయ కుట్ర కోణంలోనే మేడిగడ్డ దగ్గర బాంబులు పెట్టి పేల్చారని, దీంతోనే పిల్లర్‌లో పగుళ్లు వచ్చాయని చెప్పారు. ఫిర్యాదు చేసి ఇన్ని రోజులు అవుతున్నా మురళీధర్ రావు మాటలు విన్నాక, కావాలనే మేడిగడ్డ వద్ద బాంబులు పెట్టి పేల్చినట్లు బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు నేడు మరింత బలపడుతున్నాయి.
మేడిగడ్డ బ్యారేజ్ కూల్చేశారని అధికారులు ఫిర్యాదు చేసి మూడు సంవత్సరాలు గడిచింది
ఇంతవరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు
మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొలిపి, ఆ కేసు గురించి గుర్తుచేయాలనే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాము
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ https://t.co/e3wJOPKw93
— Telugu Scribe (@TeluguScribe) October 22, 2026
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సీఈ సురేష్ నిజం చెప్పాడని అతన్ని సస్పెండ్ చేశారు.
ఇప్పుడు ఐఏఎస్ అధికారుల కమిటీ వేశారు. సోషియాలజీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్న వాళ్లకు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, బొగ్గు వినియోగం ఎలా అర్థమవుతాయి?
ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులను పంపించారు.
విద్యుత్ సంస్థలను బాగు చేసిన ఇంజనీర్లపై కక్ష ఎందుకు?
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
— Telugu Scribe (@TeluguScribe) October 22, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

