ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టుగానే.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్న లక్ష్యాన్ని చేరుకొన్న ఎనిమిదేండ్ల తర్వాత మరోపాత్రలోకి మారిపోయింది. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా అనేక సంక్షేమ పథకాలతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొన్న సీఎం కేసీఆర్.. ఇక దేశం కోసం బయలుదేరారు. అరుదైన సన్నివేశానికి బుధవారం విజయదశమి సందర్భంగా తెలంగాణ భవన్ వేదికైంది. దేశమంతా ఆసక్తిగా గమనిస్తున్న గంభీర వాతావరణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా ప్రకటించారు. ఆ సందర్భంగా తెలంగాణభవన్‌లో పండుగ వాతావరణం నెలకొన్నది.
శుభకృత్ నామసంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమి (05-10-2022) నాడు మధ్యాహ్నం 1.19 గంటలకు తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా పేరుమారుస్తూ చేసిన తీర్మానంపైన సంతకం చేస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
బీఆర్ఎస్ ప్రకటన సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ముచ్చట్లు
జాతీయపార్టీగా బీఆర్ఎస్ ప్రకటన వెలువడటంతో నిజామాబాద్‌లో భారీ ర్యాలీతో సంబురాలు చేసుకున్న పార్టీ కార్యకర్తలు
సీఎం కేసీఆర్ జాతీయపార్టీగా బీఆర్ఎస్ను ప్రకటించడాన్ని చప్పట్లతో స్వాగతిస్తున్న ఎంపీలు బడుగుల, పార్థసారథిరెడ్డి, దామోదర్‌రావు, సంతోష్‌కుమార్,కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
బీఆర్ఎస్ ప్రకటన వెలువడ్డాక కరీంనగర్లో పార్టీ శ్రేణుల సంబురాలు