మహబూబాబాద్ : గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్ అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం కురవి మండలంలోని శ్రీ వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్రంలో 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంపు, గిరిజన బంధు ఆమలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద అర్చన, అభిషేకాలు చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ గారు గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్‌లో సంత్ సేవాలాల్, ఆదివాసీ కుమ్రం భీమ్ ల ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించారని మంత్రి గుర్తు చేశారు.
గిరిజన రిజర్వేషన్ పెంపుపై 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించి బిల్లును కేంద్రానికి పంపితే కాలయాపన చేసి, ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. పోడు భూముల సమస్య పరిష్కారాన్ని కోసం జీవో ఇచ్చామన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గిరిజన ఆదివాసీలకు గిరిజన బంధు ప్రకటించి, వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు, జిల్లా జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, కురవి జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, సర్పంచులు కొమ్మినేని రవీందర్, రంగమ్మ, నెహ్రూ నాయక్, హరి ప్రసాద్, భూక్య జీవన్,వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.