Minister Satyavati Rathod | అన్నదాతలకు ఆపద్భాంధవుడు సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
Minister Satyavati Rathod | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఆపద్బాంధవుడయ్యారని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) అన్నారు.
ములుగు : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఆపద్బాంధవుడయ్యారని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు జిల్లా చల్వాయి గ్రామంలో రైతు దినోత్సవంలో(Farmers Day) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ శతాబ్ది కాలంలో జరగని అభివృద్ధి దశాబ్ది కాలంలో జరిగిందని పేర్కొన్నారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,601 వ్యవసాయ విస్తరణ అధికారుల క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.572.22 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రైతుబంధు, రైతుబీమా(Raitu Beema) పథకాలకు సీఎం కేసీఆర్(CM KCR) శ్రీకారం చుట్టారు.75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో రూ.50వేల కోట్లు రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. వ్యవసాయం దండగ కాదు, పండగ అని నిరూపించారని వెల్లడించారు.
సమైక్య పాలనలో వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుదేలైపోయిందని వివరించారు.గత ప్రభుత్వాల పాలనలోసాగునీరు లేదు. బోర్లపై ఆధారపడదామంటే కరెంటు లేదు. పెట్టుబడి లేదు. అప్పులతో, కుటుంబాన్ని పోషించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి ఉండేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని సారించి అనేక సంక్షేమ పథకాలను(Welfare Schemes) అమలు చేశారని తెలిపారు.
రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుందని వివరించారు. ములుగు జిల్లాను పర్యటన ప్రాంతంగా అభివృద్ధి చేశామని అన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

