హైదరాబాద్ జనవరి 16 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ లౌకికవాదిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని హోంమంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. ఆయన తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల వారిని విస్మయానికి గురి చేస్తున్నాయని అన్నారు. సోమవారం బిహార్ రాష్ర్టానికి చెందిన వివిధ పార్టీల ముస్లిం కార్మికులు, నాయకులు హైదరాబాద్లోని హోంమంత్రి నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకుడు బద్రుద్దీన్ ఆధ్వర్యంలో బిహార్ నుంచి 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణకు దేశంలోనే ప్రముఖ స్థానం కల్పించారన్నాని అన్నారు. అందుకే దేశంలోని వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.