అయిజ, ఆగస్టు 24 : సీఎం కేసీఆర్ సకల సౌకర్యాలు కల్పిస్తుండటంతో సర్కారు వైద్యంపై ప్రజలకు భరోసా ఏర్పడింది. ఫలితంగా ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పీహెచ్సీలో రికార్డు స్థాయిలో కాన్పులు జరుగుతున్నాయి.
బుధవారం ఉదయం 10 నుంచి గురువారం ఉదయం 10 వరకు (24 గంటల్లో) పది సాధారణ ప్రసవాలు జరగ్గా ఐదుగురు మగ, ఐదుగురు ఆడ శిశువులు జన్మించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. వీరికి కేసీఆర్ కిట్లు అందజేసి 102 వాహనంలో ఇండ్లకు సురక్షితంగా తరలించినట్టు వైద్యాధికారి విష్ణు తెలిపారు. 2022-23లో ఈ పీహెచ్సీ 1,048 కాన్పులు నిర్వహించి రాష్ట్రంలోనే రికార్డు సాధించింది.