CM KCR | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): మందమర్రికి చెందిన ఒక చాకళోల్ల అమ్మాయి బీసీ రెసిడెన్షియల్ కాలేజీలో పాసయ్యిందని, 470 మార్కులకు 468 మార్కులు సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. భవిష్యత్తులో ఏమవుతావని అడిగితే.. కలెక్టర్ అవుతానని చెప్పిందని, ఆ మాట విని తనకెంతో సంతోషం అనిపించిందని చెప్పారు. బాగా చదువుకోవాలని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, రేపు సాయంత్రంలోగా తానే సంతకం పెట్టి రూ.5 లక్షల చెక్కు పంపిస్తా బ్యాంకులో పెట్టుకుని బాగా చదువుకోమని చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు.