హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ మైనార్టీలకు పెద్దపీట వేసిందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ప్రశంసించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మైనార్టీల సంక్షేమానికి కేవలం రూ.900 కోట్లను మాత్రమే కేటాయిస్తే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కేవలం 9 ఏండ్లలోనే రూ.12 వేల కోట్లు కేటాయించారని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని మైనార్టీలకు బీఆర్ఎస్ పార్టీ చాలా చేసిందని, అంతకు ముందు పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని అన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా? అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. మైనార్టీలను మోసగించిందే కాంగ్రెస్ పార్టీ అని, బీఆర్ఎస్ సరార్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తే కర్రుకాల్చి వాత పెడతామని స్పష్టం చేశారు. తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైన్సాన్స్ కార్పొరేషన్ ద్వారా సీఎం కేసీఆర్ 100 శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం అందించడంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేవారికి సాలర్షిప్లు అందజేస్తున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలకు ఏం చేశారో చెప్పాలని రేవంత్‌ను నిలదీశారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం కేసీఆర్ దాదాపు 2.85 లక్షల క్రైస్తవ కుటుంబాలకు కానుకలు అందజేస్తున్నారని, ఆయన మైనార్టీల పక్షపాతి అనడానికి 204 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలే నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ హకుల సమావేశం పేరుతో బీఆర్ఎస్ సరార్‌పై విషం కకుతున్నారని రాజీవ్‌సాగర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన క్రిస్టియన్లను బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయలేరని స్పష్టం చేశారు. గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన రేవంత్‌రెడ్డి క్రిస్టియన్ల సంక్షేమం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని విమర్శించారు.