నిర్మల్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వచ్చే నెల 4న నిర్మల్ (Nirmal) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate), బీఆర్ఎస్ కార్యాలయాన్ని (BRS party office) ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, అధికారులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎల్లపల్లి గ్రామ శివారులోని క్రషర్ రోడ్లో సభ నిర్వహిస్తున్నామని, గత తొమ్మిదేండ్లుగా ప్రజలకు అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి సీఎం ప్రసంగిస్తారని తెలిపారు.
ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటుచేసి ప్రతీ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనాలను నిర్మించారని చెప్పారు. సీఎం కేసీఆర్ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జూన్ 2 వరకు అన్ని పనులు పూర్తి చేయాలని, సభకు వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల కోసం అవసరమైన మేర పార్కింగ్ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
Indrakaranreddy 1