శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:54:35

బోగభాగ్యాలతో విలసిల్లాలి

బోగభాగ్యాలతో విలసిల్లాలి

  • రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిరి సంపదలతో, బోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు. మరోవైపు, రాష్ట్ర ప్రజలకు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ.. సంతోషంగా బోగి, కనుమ, సంక్రాంతిని జరుపుకోవాలని కోరారు.