హైదరాబాద్ : ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సంబురాలు అంబరాన్నంటాయి. మొత్తం తెలంగాణలో 91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రకటించడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు.