CM KCR Press meet | నన్ను జైలుకు పంపుతవా? అంత బలుపా? అంటూ బీజేపీ ( BJP ) రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi sanjay )పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడినని, ఆ విషయం మరిచిపోయి కొందరు ఇష్టమొచ్చినట్లు నోటికి ఏదస్తే అది మాట్లాడుతున్నారని బండి సంజయ్‌ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ అన్నారు. సభలు పెట్టి తన మెడలు వంచుతా అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలు, విద్వేష ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. నన్ను జైలుకు పంపుతానంటూ పిచ్చి కూతలు కూస్తున్నావ్.. ఇక్కడుంది కేసీఆర్.. ఒక్కసారి టచ్ చేసి చూడు.. అంటూ బండి సంజయ్‌ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను జైలుకి పంపి ఇక్కడ నువ్వు బతికి బట్టకట్టి తిరుగుతవ్ అనుకుంటున్నవా? అంటూ ధ్వజమెత్తారు. ఇన్నిరోజులూ రోడ్డుపైన పోతుంటే కుక్కలు మొరుగుతాయని భావించి ఊరుకున్నాం.. ఇక ఉపేక్షించేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇకపై అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుకలు చీరేస్తా జాగ్రత్త అంటూ మండిపడ్డారు. నన్ను తిట్టినా భరించినా.. తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఊరుకోడు కేసీఆర్ అంటూ విరుచుకుపడ్డారు. అబద్ధాలు ఆడుతున్న బీజేపీ నాయకులను అడుగడుగునా అడ్డుకుంటామని స్పష్టంచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR : పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా నిరూపించిన సీఎం కేసీఆర్
CM KCR Press meet | కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్..
CM KCR : ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట.. ఎవరిని నమ్మాలి : సీఎం కేసీఆర్
కేంద్రం వరి సాగు లేదని అవమానించింది : సీఎం కేసీఆర్
CM KCR : బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పిన ఆర్బీఐ : కేసీఆర్