CM KCR | హైదరాబాద్ : గత ఎన్నికల్లో పట్టిన గతే కాంగ్రెస్కు ఇప్పుడు కూడా పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఆ పార్టీ గురించి ప్రజలకు బాగా తెలుసన్నారు సీఎం.
తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మేం పక్కా రాజకీయ పార్టీగానే ముందుకు వెళ్తున్నామని సీఎం ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని 2014 ఎన్నికలప్పుడే చెప్పాం. ఎన్నికల కోసం ఆపద మొక్కులు మొక్కే పార్టీలు కొన్ని ఉంటాయి. ఎవళ్లు ఏందో తెలుసు. పోయిన ఎలక్షన్లో ఇదే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల వరకు రుణమాఫీ ఒక్కటే సారి చేస్తామని చెప్పారు. ప్రజలకు కూడా తెలిసి ఉండాలి.. ప్రభుత్వం వద్దకు డబ్బు వస్తూ ఉంటుంది.. పోతూ ఉంటుంది.. ప్రభుత్వం దగ్గర బీరువాలలో డబ్బు ఉండదు. ఒక్కటే సారి రుణమాఫీ ఇస్తమని చెప్పలేదు.. ఒక లక్ష మాత్రమే ఇస్తామని చెప్పాం. విడుతల వారీగా ఇస్తామని చెప్పాం. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు.. మమ్మల్ని నమ్మారు. ఇప్పుడు కూడా అదే జరుగుతది.
50 ఏండ్లు అవకాశం ఇచ్చిన తర్వాత మళ్లీ ఒక్క ఛాన్స్ ఏంది? అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పింఛన్ ముఖాన కొట్టినోళ్లు.. ఇప్పుడు మళ్లీ వచ్చి రూ.4 వేల పింఛన్ ఇస్తనంటే ఎవరైనా నమ్ముతరా? మాకు చెప్పరాదా? రూ.5వేలు ఇస్తామని. ప్రజలకు ఎవరేంటో తెలుసు. మాకు విజయాన్ని అందించి… కాంగ్రెస్ను తోల్కబోయి బొంద పెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు.