హైదరాబాద్: మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతిని సీఎం కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో మృతిచెందారు.