హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సోదర భావం, ధర్మ చింతన ప్రతి మానవుడిలో ఉండాలని చెప్పిన మహమ్మద్ ప్రవక్త బోధనలు, సూక్తులు, సూచించిన ధార్మిక విషయాలు అందరూ అనుసరించాల్సినవని సీఎం కేసీఆర్ తెలిపారు.