CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రగతి భవన్‌ను వీడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రతి రోజు రెండు చోట్ల బహిరంగ సభలకు హాజరవుతున్నారు. అయితే శనివారం రాత్రి సిద్దిపేటలో బహిరంగ సభ ముగించుకుని, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన సీఎం కేసీఆర్.. సిద్దిపేట పట్టణ శివారులో కాసేపు ఆగారు.
శివారులో ఉన్న పొన్నాల సోని దాబాలో కేసీఆర్ కాసేపు సేద తీరారు. దాబాలో కేసీఆర్ చాయ్ తాగారు. సీఎంతో పాటు మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, దామోదర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సిద్దిపేట నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.