హైదరాబాద్ : శాసనసభ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా సభ్యులు, అధికారులకు భోజనం, ఇతర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు.
శాసనసభలో దళిత బంధుపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. సభకు సీఎం కేసీఆర్ హాజరై.. దళిత బంధు పథకంపై ప్రసంగించనున్నారు. ఈ పథకంపై సభ్యులకు కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇవ్వనున్నారు. అనుమానాలను నివృత్తి చేయనున్నారు.