హైదరాబాద్ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వాన్నిచాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనగమనం, నేటికీ అందరికీ ఆచరణీయమని సీఎం అన్నారు. కాగా.. క్రిస్మస్ పండుగ సందర్భంగా అలంకరించిన విద్యుత్తు దీపాలతో మెదక్ చర్చి ఇలా వెలిగిపోయింది.