హైదరాబాద్ : చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ చిప్కో ఉద్యమాన్ని (చెట్లను కౌగిలించుకోవడం) నడిపిన, ప్రముఖ పర్యావరణ వాది, శ్రీ సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలపై చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణకు జీవితాంతం కృషి చేస్తూ తన జీవితాంతం పరితపించిన బహుగుణ మరణం ప్రకృతి, జీవావరణ, పర్యావరణ రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఐదు దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలపై చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణకు జీవితాంతం కృషి చేస్తూ తన జీవితాంతం పరితపించిన బహుగుణ మరణం ప్రకృతి, జీవావరణ, పర్యావరణ రంగానికి తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు
— Telangana CMO (@TelanganaCMO) May 21, 2021