హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతను ఇచ్చారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్తే పరిస్థితి లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండే. మేం ప్రారంభించిన ప్రాజెక్టులు, పనులు మేం చేయాల్సి ఉండే. కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ అవసరం లేదు. పాలమూరు, సీతారామ పూర్తి కావాలి. తెలంగాణకు ఐటీ, పరిశ్రమల పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. బజార్లో అరిచే వ్యక్తుల గురించి మాట్లాడను. కేసీఆర్ ఎప్పుడు మోసం చేయడు.. ఏం చెప్పినామో అదే చేస్తాం.
తొలిసారి 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు, ఇప్పుడు 95-105 సీట్ల మధ్య గెలుస్తాం. 25 రోజుల తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తాను.. దాని చూస్తే మీరే ఆశ్చర్య పడుతారు. నిన్ననే ఒక లేటెస్ట్ రిపోర్టు వచ్చింది. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 స్థానాల్లో మేం గెలుస్తామని రిపోర్టులో వచ్చిందని కేసీఆర్ తెలిపారు.