హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తె లంగాణ) : గల్ఫ్ కార్మికులకు 5లక్షల బీమా వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వ డంపై హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఈ సదుపాయాన్ని వర్తింపజేస్తామని కేసీఆర్ మాటివ్వ డంపై గల్ఫ్కార్మికులు, ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు గల్ఫ్ కార్మికుల బాధలను పలుమార్లు విన్నవించానని, ఈ క్రమంలో వారికి అండగా నిలబడి బీమా సౌ కర్యం కల్పిస్తామనడం హర్షణీయమని గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల చెప్పా రు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎ న్నికల సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో ఉత్తర తెలంగాణలోని లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనున్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంత వాసులకు మేలు జరుగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ హామీపై ఎన్నారైల తరఫున మహేశ్ బిగాల ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో కేసీఆర్ ధీమా నింపారని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
గల్ఫ్‌లో తెలంగాణ కార్మికులు మరణిస్తే ఇక్కడ వారి కుటుంబాలు రోడ్డున పడకుండాఉండేందుకు రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో గల్ఫ్ నుంచి సెలవులపై స్వగ్రామాలకు వచ్చిన కార్మికులు శుక్రవారం బాలొండ నియోజకవర్గంలోని వాడి, పచ్చల నడుకుడ గ్రామాల్లో సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నారై హకుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు, వాడి సర్పంచ్ మహేశ్, పచ్చల నడుకుడ సర్పంచ్ ఏ గంగరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని గల్ఫ్‌లోని తెలంగాణ కార్మికులను కోటపాటి కోరారు.