స్వప్నలోక్ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతోపాటు పలువురు గాయపడటంపై సీఎం విచారం వ్యక్తంచేశారు.
- ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
- రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతోపాటు పలువురు గాయపడటంపై సీఎం విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

వెన్నెల మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న బీఆర్ఎస్ నాయకులు
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతోపాటు గాయపడినవారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు సీఎం సూచించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

