జయశంకర్ భూపాలపల్లి : దేశంలోని మతతత్వ పార్టీ బీజేపీ ని ఓడించడానికి(Defeat BJP) అన్ని పార్టీల నాయకులు ఏకమై సీఎం కేసీఆర్(CM KCR)కు మద్దతు(Support) ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CPM Secretary )తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabadram) పిలుపునిచ్చారు.
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేడే వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలో హనుమాన్ దేవాలయం నుంచి మున్సిపల్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని (Constitution)తుంగలో తొక్కేయాలని చూస్తుందని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగానికి బదులు మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసే కుట్ర పన్నుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి బంద్ సాయిలు, రాష్ట్ర నాయకులు వెంకటేశ్, యాకన్న, తదితరులు పాల్గొన్నారు.