మహబూబ్‌నగర్ : జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల ( Irrigation Projects ) పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) గురువారం పరిశీలించారు. గురువారం బెంగుళూరు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్ చేరుకున్న సీఎం మొదటగా మక్తల్-నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ( Kodangal Lift ) జరుగుతున్న పనులను వివరించే ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.
మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఎత్తిపోతల ప్రాజెక్టు ప్యాకేజీ -1 సైట్ వద్దకు చేరుకుని అక్కడ పనులను పరిశీలించారు. ప్యాకేజీ -1 లో భాగంగా జరుగుతున్న పంప్ హౌస్ పనులు ఎంత మేరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంక్రీటు పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు కర్నాటక మాజీ మంత్రి ఎన్ఎస్ బోసెరాజు , ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.