హైదరాబాద్, జనవరి 15 (నమస్తేతెలంగాణ) : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ చార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేరొన్నది. ఈ మేరకు గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన ఓ పత్రికా విలేకరి బాలగంగాధర్ తిలక్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.