హైదరాబాద్ : తెలంగాణ(Telangana)లో బీఆర్ఎస్ ప్రభుత్వం నవ శకానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు పౌష్ఠికాహారం అందించేందుకు మానవీయ కోణంలో స్పందించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి అల్పాహార (CM Breakfast) పథకం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైంది.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లాపరిషత్ స్కూల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో (Minister Sabitha Indra Reddy) కలిసి మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. ఇక రాష్ట్రంలోని నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. సీఎం బ్రేక్ఫాస్ట్ వల్ల రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి చదువుతున్న 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ఇది విద్యావ్యవస్థలో సమూల మార్పుతెస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మహబూబ్నగర్లో విద్యార్థులకు తినిపిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
హన్మకొండలో విద్యార్థులకు వడ్డిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సూర్యాపేటలో విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి
వనపర్తి జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి
కరీంనగర్లో విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తున్న మంత్రి గంగుల
ఆదిలాబాద్ జిల్లాలో..
భూపాలపల్లి జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లాలో..
ములుగు జిల్లాలో..
మునుగోడు నియోజకవర్గంలో..
నల్లగొండ నియోజకవర్గంలో..
పటాన్ చెరు నియోజకవర్గంలో..
పెద్దపల్లి నియోజకవర్గంలో..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో..