రాష్ట్రంలో వర్షాలు పడుతుండటం, ప్రజలు సమస్యలతో సతమతవుతుంటే సీఎం, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాహుల్‌గాంధీ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.
ఆటో డ్రైవర్లు, రైతులు, విద్యార్థులు, రేషన్‌కార్డుల కోసం జనాలు, వేతనాల కోసం ఉద్యోగులు ఇలా ఎంతో మంది తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్డెక్కారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆటోలు నడవక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్లు పేర్కొన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఐదు మండలాల ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్లు మణుగూరులో ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.