బడంగ్‌పేట/ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 31 : ‘మహిళలను అవమానించడం మంచి పద్ధతి కాదు.. మహిళల ఆగ్రహానికి సీఎం, డిప్యూటీ సీఎం గురికాక తప్పదు.. వారిద్దరూ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని బీఆర్ఎస్ శ్రేణులు, ఓయూలో విద్యార్థులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు బుధవారం రాత్రి ఆందోళన చేశారు.
బాలాపూర్‌లో బీఆర్ఎస్ నేత అర్కల కామేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో, ఓయూలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిష్టిబొమ్మలను దహనం చేశా రు. విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్ వద్ద ఆందోళనలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, కార్పొరేటర్లు అనిల్ కుమార్ యాదవ్, రాజేందర్‌రె డ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, భూపేశ్‌గౌడ్, విజయలక్ష్మి, యాదగిరి, ప్రభాకర్‌రెడ్డి, సురభి ల త, మాధవి, గోపీ యాదవ్, బషీర్, నాగరాజు, జంగయ్య, మ హేందర్, వెంకటేశ్, ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులు శిగ వెంకటేశ్‌గౌడ్, జం గయ్య, నాగేందర్, అవినాశ్, శ్రీకాంత్, రామకృష్ణ, పవన్, సాయి, రాహుల్ పాల్గొన్నారు.