హైదరాబాద్, ఫిబ్రవరి10 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సాయం త్రం అసెంబ్లీలో సీఎల్పీ సమావేశం జరగనుంది. 12న ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో చర్చలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైనా చర్చించనున్నట్టు సమాచారం.