హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 25: రాజ్యాంగం పౌరులకు సమాన హోదా, హకు కల్పించిందని, దాన్ని బీజేపీ కాలరాస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార ఆరోపించారు. సమాజంలో వైషమ్యాలు తీసుకొచ్చి అల్లకల్లోలం సృష్టించైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు. మంగళవారం ఆయన హనుమకొండ లో మీడియాతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు.