హైదరాబాద్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ) : మౌలిక వసతుల కల్పన జరిగితేనే ఏ వ్యవస్థ అయినా సత్ఫలితాలు సాధిస్తుందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. తెలంగాణ హై కోర్టు నూతన భవనాల నిర్మాణం, మౌలిక వ సతుల కల్పనకు చేపడుతున్న చర్యలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను మరింత ఇనుముడింపజేస్తాయని పేర్కొన్నారు. ఆదివారం ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో 100 ఎకరాల్లో రూ.2,583 కోట్లతో నిర్మిస్తున్న నూతన హైకోర్టు రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా సీజేఐ ప్రసంగిస్తూ.. ఇప్పుడున్న హైకోర్టులో 2009లో అగ్నిప్రమాదం సంభవించడంతో కొత్త హైకోర్టు భవనాలను నిర్మించాలన్న తీర్మానం జరిగిందని, ఆ కల 17 ఏండ్ల తర్వాత సాకారం కాబోతున్నదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం కొత్త హైకోర్టు కాంప్లెక్స్ ని ర్మాణాలు రెండేండ్లలో పూర్తవుతాయని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఈ కాంప్లెక్స్‌లో కోర్టులు, మంచి పారింగ్ వసతులు, న్యాయవాదులకు చాంబర్లు, కోర్టు కా ర్యాలయాలు, న్యాయమూర్తుల నివాసాలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ప్రస్తుత హైకోర్టు భవనం చారిత్రకమైనదని, కానీ.. ఇప్పటి అవసరాలకు అది సరిపోవడం లేదని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 24 నుంచి 42కు పెరిగిందని, త్వరలో ఈ సంఖ్య 50కి పెరుగవచ్చని పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రసంగిస్తూ.. రూ.2,583 కోట్లతో కొత్త హైకోర్టు భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. గత 6 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మి ది జిల్లా కోర్టు సముదాయాల నిర్మాణాలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించిందని, ఇది తెలంగాణలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పర గౌరవంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర హైకోర్టు నూతన భవనాల నిర్మాణం తన హయాంలో జరగడాన్ని ఎన్నటికీ మరచిపోలేనని చెప్పారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్వీ భట్, జస్టిస్ అలోక్ అరాధే తదితరులు ప్రసంగించారు. ఆ తర్వాత అతిథులకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ ఎస్ నంద జ్ఞాపికలు అందజేయగా.. జస్టిస్ శ్యాం కోషి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, రిటైర్డు జడ్జి జస్టిస్ సుభాష్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, డీజీ పీ శివధర్‌రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ పీ నరసింహశర్మ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారె డ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.