వారంలో రెండు రోజులు వర్చువల్‌గా విచారణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సీజేఐ ఆదేశం
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వృథా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రస్తుతానికి సోమ, శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా కేసుల విచారణలు నిర్వహించాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ సోమవారం తెలిపారు.
న్యూఢిల్లీ : పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వృథా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రస్తుతానికి సోమ, శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా కేసుల విచారణలు నిర్వహించాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ సోమవారం తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మే 15 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సోమ, శుక్రవారాల్లో కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారించాలని నిర్ణయించింది.
అలాగే ఇంధనాన్ని పొదుపుగా వినియోగించేందుకు న్యాయమూర్తులు కార్‌పూలింగ్ విధానాన్ని ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సోమవారం ఒక కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సీజేఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు.ఆన్లైన్ ద్వారా విచారణలు చేపట్టినందుకు భారత ప్రధాన న్యాయమూర్తికి ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోని అన్ని హైకోర్టులు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని తాను కోరుతున్నానన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ‘నా మిత్రుడు రోహత్గీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను’ అని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

