కరీంనగర్ కమాన్‌చౌరస్తా/ చొప్పదండి, ఏప్రిల్ 16: సివిల్స్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కు చెందిన ఇద్దరు అభ్యర్థులు సత్తాచాటారు. రామడుగు మండలం వెలిచాలకు చెందిన నం దల సాయికిరణ్ 27వ ర్యాంకు సాధించాడు. గ్రామంలోనే 5 వరకు చదివిన సాయి కిరణ్, 6 నుంచి 10వ తరగతి దాకా కరీంనగర్ తేజస్ స్కూల్లో, ఇంటర్ కరీంనగర్ ట్రినిటీ కళాశాలలో, బీటెక్ ఎన్ఐటీ వరంగల్‌లో పూర్తి చేశాడు.
సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.కరీంనగర్‌కు చెందిన కొలనుపాక సహన 739వ ర్యాంకు సాధించింది. సహన తండ్రి అనిల్ రిపోర్టర్ కాగా, తల్లి గృహిణి. కరీంనగర్‌లోని కెన్‌క్రెస్ట్ సూల్లో టెన్త్ దాకా చదివి 9.8 గ్రేడ్ సాధించింది. ఇంటర్ హైదరాబాద్‌లోని శ్రీగాయత్రి కళాశాలలో 979 మారులతో పూర్తి చేసింది. హైదరాబాద్ లోని జేఎన్జీయూలో బీటెక్ కంప్లీట్ చేసి, ఢిల్లీలోని శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నది. తాజా ఫలితాల్లో 739 ర్యాంకు సాధించింది.
మా మమ్మీడాడీ ప్రోత్సహించడం వల్లే నేను యూపీఎస్సీ సివిల్స్‌లో ర్యాంకు సాధించా. స్మితా సబర్వాల్ మేడం కరీంనగర్లో కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆమె వర్ నాకు నచ్చింది. అందుకే ఆమెను ఆదర్శంగా తీసుకున్నా. కలెక్టర్ కావాలని డిసైడ్ అయ్యా. మా పేరెంట్స్ సహకారంతో ప్రిపేర్ అయ్యాను. ఏ క్యాడర్ లో జాయిన్ అయినా ఐఏఎస్ కావడమే నా లక్ష్యం.
– కొలనుపాక సహన, 739 ర్యాంకు