పెట్రోల్, డీజిల్ సరఫరా 15శాతం పెంచండి
పెట్రోల్, డీజిల్ సరఫరాను వెంటనే 10 నుంచి 15శాతం పెంచాలని ఆయిల్ మారెటింగ్ కంపెనీలను పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు.
- కోతల సమయంలో ఎక్కడా ఇంధన కొరత ఉండొద్దు
- ఆయిల్ కంపెనీలకు సివిల్ సైప్లె కమిషనర్ ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్ సరఫరాను వెంటనే 10 నుంచి 15శాతం పెంచాలని ఆయిల్ మారెటింగ్ కంపెనీలను పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. ముఖ్యంగా రబీ కోతల సమయంలో ఎకడా ఇంధన కొరత రానివ్వొద్దని, ఆదివారాలు, సెలవు రోజుల్లోనూ పగలు రాత్రి (24 గంటలు) పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
సివిల్ సైప్లె భవన్లో గురువారం ఆయన ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే పుకార్లతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో నెలకొన్న ఇబ్బందుల కారణంగా అక్కడి ప్రజలు తెలంగాణ నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
ఫలితంగా రాష్ట్రంలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని అన్నారు. దీనికి తోడు ఇండస్ట్రియల్ డీజిల్ (లీటరుకు రూ.150), రిటైల్ డీజిల్ (రూ.95) మధ్య ఉన్న ధరల వ్యత్యాసంతో వ్యాపారులు రిటైల్ బంకుల నుంచి డీజిల్ కొనడం వల్ల స్థానికంగా కొరత ఏర్పడిందని చెప్పారు.
వీటన్నింటిని పరిష్కరించేందుకుగానూ అవసరమైన దానికంటే ఎకువగా ఇంధనాన్ని సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజున రోజువారీ డీజిల్ పంపిణీ 190 శాతం పెరిగి 21,295 కిలో లీటర్లు పంపిణీ జరిగిందని, అలాగే పెట్రోల్ పంపిణీ 118శాతం పెరిగి 34,170 కిలో లీటర్ల పంపిణీ జరిగిందని తెలిపారు. ఇది రోజువారీ కన్నా 158 శాతం ఎక్కువ అని తెలిపారు.
సివిల్ సైప్లె శాఖ తీసుకున్న ముఖ్యమైన చర్యలు..
1. పంటల రక్షణ: రబీ సీజన్‌కు ఎటువంటి ఆటంకం కలుగకుండా, వరి కోత యంత్రాలకు, నిత్యావసర సరుకుల రవాణాకు ఇంధన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు.
2. ఇంధన కొరత ఉండకూడదు: రాష్ట్రంలో ఎకడా బంకుల దగ్గర ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడానికి వీల్లేదు. ప్రతి నాలుగు గంటలకోసారి అధికారులు బంకుల్లో స్టాక్ ఎంతుందో చెక్ చేయాలి.
3. బ్లాక్ మారెటింగ్ పై ఉకుపాదం: అక్రమంగా ఇంధనాన్ని దాచిపెట్టడాన్ని అడ్డుకొనేందుకు సివిల్ సైప్లె, రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన బృందాల విస్తృత తనిఖీలు.
4. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు: ఇంధనం కోసం ఇతర రాష్ట్రాల వాహనాలు తెలంగాణలోకి రాకుండా ఉండేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు.
5. నిరంతర 24/7 పర్యవేక్షణ, ప్రజలకు సహాయం: జిల్లా స్థాయి కమిటీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. ప్రజలు తమకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కొత్తగా ఏర్పాటు చేసిన 1967 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

