హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): పాతబస్తీలోని ఆసిఫ్‌నగర్, కుల్సుంపురా డివిజన్లో మూడు రోజులుగా జరుగుతున్న హత్యలు, నేరాల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు.
చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో సెల్‌ఫోన్ స్నాచింగ్, దోపిడీదొంగల ముఠాలను పట్టుకునేందుకు యాంటీ డెకాయి బృందాలు శుక్రవారం అర్ధరాత్రి డెకాయి ఆపరేషన్ నిర్వహించాయి. నేరాలను నియంత్రించేందుకు నగరంలో డెకాయి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు ఈస్ట్‌జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు. ఇప్పటి వరకు 8 గ్యాంగ్‌లను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. చిలకలగూడ పరిధిలోని మెట్టుగూడలో కొందరు యువకులు ముఠాగా ఏర్పడి సెల్‌ఫోన్ స్నాచింగ్, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడుండగా డెకాయి ఆపరేషన్ జరిపి నలుగురు ముఠా సభ్యులను పట్టుకున్నట్టు తెలిపారు.