e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్దు: రేవంత్‌రెడ్డికి కోర్టు ఆదేశం

డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్దు: రేవంత్‌రెడ్డికి కోర్టు ఆదేశం


హైద‌రాబాద్‌: టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు, ఈడీ కేసుల‌కు సంబంధించి తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖల మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయవ‌ద్ద‌ని తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీచేసింది. డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి త‌ర‌చూ త‌న‌పై అస‌త్య‌పు ఆరోప‌ణ‌లు చేస్తుండటంతో మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో కోటి రూపాయ‌ల‌కు ప‌రువున‌ష్టం దావావేశారు. ఈ నేప‌థ్యంలో కోర్టు ఇవాళ ఇంజెక్ష‌న్ ఆర్డ‌ర్ జారీచేసింది.

కాగా, కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావాపై అక్టోబ‌ర్ 20న విచార‌ణ జ‌రుప‌నున్న‌ట్లు సిటీ సివిల్ కోర్టు తెలిపింది. మంత్రి కేటీఆర్‌కు డ్ర‌గ్స్ కేసుతో సంబంధం ఉంద‌ని, ఆయ‌న డ్ర‌గ్ టెస్ట్ చేయించుకోవాల‌ని వైట్ చాలెంజ్ పేరుతో రేవంత్‌రెడ్డి ఇటీవ‌ల స‌వాల్ విసిరారు. ఆ స‌వాల్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.. చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు వెళ్లివ‌చ్చిన వ్య‌క్తితో క‌లిసి డ్ర‌గ్ టెస్టుకు వెళ్లి త‌న స్థాయిని దిగ‌జార్చుకోలేన‌ని, రాహుల్‌గాంధీ డ్ర‌గ్ టెస్టుకు సిద్ద‌మా..? అని ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలోనే మంత్రి కేటీఆర్ రేవంత్‌రెడ్డిపై ప‌రువున‌ష్టం దావా కూడా వేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement