హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్స వం సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రవీంద్రభారతిలో జరుగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నట్టు వెల్లడించారు. ‘మై ఓట్-ఐయామ్ ఇండియా’ థీమ్‌తో కార్యక్రమా న్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఏసీబీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డుల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మందికి ఏసీబీ డీజీ చారుసిన్హా రివార్డులు అందజేశారు. సోమవారం ఏసీబీ కేంద్ర కార్యాలయంలో ఏసీబీ కేసులపై చారుసిన్హా సమీక్ష నిర్వహించారు. 2025 చివరి త్రైమాసికంలో సాధించిన పనితీరుపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని వి భాగాల్లోని అధికారులు, సిబ్బంది ప్రదర్శించిన నైపుణ్యం, నిబద్ధతను అభినందించారు. గత 14 ఏండ్లలో చివరి త్రైమాసికంలో నమోదైన కేసుల్లో 2025 చివరి త్రైమాసికంలోనే అత్యధికంగా 78 కేసులు నమోదు చేసినట్టు తెలిపా రు. అవినీతికి వ్యతిరేక పోరాటంలో ఇది కీలక విజయమని చె ప్పారు. 14 ఏండ్లలో అన్ని చివరి త్రైమాసికాల్లో కలిపి మొత్తం 494 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఏసీబీ డైరెక్టర్ తరుణ్‌జోషి, ఇతర అధికారులు పాల్గొన్నారు.