కాంట్రాక్ట్ కార్మికులపై విరిగిన లాఠీ
- ఎన్టీపీసీలో గేట్మీటింగ్లో పాల్గొన్న వారిపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది దాడి
- 70 మందికి పైగా గాయాలు.. ఖండించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్
జ్యోతినగర్, ఆగస్టు 22: న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులపై సీఐఎస్ఎఫ్ బలగాలు దాష్టీకం ప్రదర్శించాయి. లాఠీలు విరిగేలా చావబాదడంతో 70 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారసత్వ ఉద్యోగాల అమలు, సీనియర్ కార్మికులు, ఐటీఐ అర్హత కలిగిన వారికి ఉద్యోగోన్నతి తదితర డిమాండ్లపై సోమవారం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ఎన్టీపీసీ లేబర్గేట్లో సమావేశమయ్యారు. అనంతరం నిరసన తెలిపేందుకు ప్లాంట్ గేట్వైపు వెళ్తుండగా సీఐఎస్ఎఫ్ బలగాలు అక్కడికి చేరుకొని, కార్మికులపై లాఠీచార్జి చేశాయి. ఆగ్రహానికి గురైన కార్మికులు రాళ్లు విసిరారు. లాఠీచార్జిలో గాయపడిన కార్మికులను గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బాధితులను పరామర్శించారు. కార్మికులపై లాఠీచార్జి దుర్మార్గమైన చర్య అని, ఈ ఘటనను సీఎం కేసీఆర్, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్మికులు కోలుకునే వరకు వేతన మాస్టర్లు చెల్లించాలని జేఏసీ నాయకులు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంట్రాక్ట్ కార్మికులపై లాఠీచార్జి చేయడం అమానుషమని ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్రావు ఖండించారు. సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వరర్స్ యూనియన్ (ఎస్సీసీడబ్ల్యూ), ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

