న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కీలక రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. నవంబర్ నెలకుగాను ఎనిమిది కీలక రంగాల్లో 7.8 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 5.7 శాతంగా ఉన్నది.
బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోవడం విశేషం. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో కీలక రంగాలు 8.6 శాతం వృద్ధిని కనబరిచాయి.