పెద్దపల్లి నిఘావిభాగం, నవంబర్ 3(నమస్తే తెలంగాణ) : కూల్చివేతల్లో గూడు కోల్పోతున్న ఓ బాధితుడు, అతడి తల్లిపై సీఐ నోరుపారేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్నగర్చౌరస్తా రోడ్డు వెడల్పులో భాగంగా షాపులను తొలగిస్తున్నారు. గణేశ్ మెకానిక్ షెడ్ వద్దకు ఎక్స్కవేటర్ రాగా, బాధితులు మున్సిపల్ అధికారులతో వాదించారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి చేరుకోగా బాధితులు, సీఐ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నియంత్రణ కోల్పోయిన సీఐ ‘.. కొడుకా.. నేను యూనిఫాంలో వచ్చాను.. ఎవ్వనివిరా?’ అంటూ రేడియం శ్రీను అనే బాధితుడిని దుర్బాషలాడాడు. చిందులు వేస్తూ.. చేయి చేసుకునేంత పనిచేశాడు. బాధితుడిని స్టేషన్‌కు తరలించి రెండు గంటల పాటు స్టేషన్లో ఉంచాడు. ఈ ఘటనను వీడియో తీసిన కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అయింది. విషయం తెలుసుకున్న సీఐ బాధితుడిని తిట్టలేదని రాజీపత్రం రాయించుకొని ఇంటికి పంపించాడు.
దొంగనాకొడుకా అంటే విచారం వ్యక్తం చేయడం సరికాదు. రేడియం శ్రీను నన్ను వ్యక్తిగతంగా విమర్శించడంతో దొంగనా కొడుకా అని అన్న మాట వాస్తవం.. ఇంతకంటే ఏమీ అనలేదు. బూతులు తిట్టలేదు.