Chukka Ramaiah | హైదరాబాద్ : ఈనాడు సంస్థల గ్రూపు చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల విద్యావేత్త చుక్కా రామయ్య సంతాపం ప్రకటించారు. అసాధారణ వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు అస్తమయం తెలుగువారికి అశనిపాతం. దాదాపు ఆరు శతాబ్దాలకు పైగా తెలుగువారి జీవితాలతో పెనవేసుకుపోయిన ఆయన విశిష్ఠ వ్యక్తిత్వ పోరాట స్ఫూర్తికి నిదర్శనం అని పేర్కొన్నారు.
పత్రిక, వ్యాపార, సినిమా, టీవీ, డిజిటల్ రంగాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. రామోజీ రావు అస్తమయం తెలుగు ప్రజలకు తీరని లోటు. అసాధారణ వ్యక్తి రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చుక్కా రామయ్య పేర్కొన్నారు.