ఇల్లెందు, జూన్ 17 : కొందరు కాంగ్రెస్ నాయకుల అండతో ఇద్దరు వ్యక్తులు బ్రిటిష్ కాలం నాటి క్రైస్తవుల సమాధుల స్థలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బస్టాండ్ సమీపంలో క్రైస్తవులు మంగళవారం సమాధుల ఆనవాళ్లతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్సీఎం చర్చి సభ్యులు మాట్లాడారు.
కాంగ్రెస్ నాయకుల అండతో ఇద్దరు వ్యక్తులు రాత్రికిరాత్రే 9.03 ఎకరాల పరిధిలో ఉన్న 250 సమాధులను తొలగించి చుట్టూ ప్రహరీ నిర్మించారని, సమాధుల స్థానంలో దుక్కిదున్నారని తెలిపారు. దీనిపై గతంలో కోర్టు స్టే విధించినప్పటికీ అధికార పార్టీ నాయకుల అండతో ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే తొలగించిన సమాధులను మళ్లీ ఏర్పాటు చేయాలని, లేదంటే నిరసనలు చేపడుతామని హెచ్చరించారు.