CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ డీ రాజేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. రాజేశ్వరరావును ప్రభుత్వం ఇటీవల క్రిస్ట్రియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్కు కలిసి ధన్యవాదాలు తెలిపి.. శాలువాతో సత్కరించారు. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.