రంగారెడ్డి జిల్లా కోర్టులు, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మైనర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌కు చుక్కెదురైంది. రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు పోక్సో కోర్టు నిరాకరించింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున బెయిల్ మంజూరు చేస్తే పోలీసుల దర్యాప్తుకు విఘాతం కలుగుతుందంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.