అనుమతుల్లేని ఇసుక రవాణాను ఆపేస్తం
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే వాహనాలను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని పెద్ద వాగులో ఇసుక తోడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వాహనాలను ఆదివారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అడ్డుకున్నారు.
- మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మాగనూర్, జూన్ 21 : అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే వాహనాలను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని పెద్ద వాగులో ఇసుక తోడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వాహనాలను ఆదివారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అడ్డుకున్నారు. అనంతరం మాగనూర్ తహసీల్దార్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. సెలవుల రోజుల్లో పట్టపగలు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించగా.. ‘మన ఇసుక -మన వాహనం’ ద్వారా అనుమతులు ఉన్నాయని తహసీల్దార్ సమాధానం ఇచ్చారు.
మన ఇసుక- మనవాహనం నిబంధనల ప్రకారం హిటాచి పెట్టకుండా వాగులో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు ఇసుకను చేరవేసి అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా తరలించాలిగాని .. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి అయినంత మాత్రాన ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతారా అని చిట్టెం ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇసుక తరలింపు జరుగాలని, లేకపోతే ఇసుక రవాణాను బీఆర్ఎస్ తరఫున అడ్డుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

