ధన్వాడ, జనవరి 30 : నారాయణపేట జిల్లా ధన్వాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించి వార్తలు మీడియాలో రావడంతో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పీఏ మాధవరెడ్డి విలేకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ అని మీరెలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులకు అస్వస్థత అయితే భోజనం వికటించడం ఎలా అవుతుందని నిలదీశారు. గ్రామ పరువు తీయొద్దని చిర్రుబుర్రులాడారు.